సెకండ్ లిస్ట్ రెడీ..ఇందులో ఎవరెవరో.. - MicTv.in - Telugu News
mictv telugu

సెకండ్ లిస్ట్ రెడీ..ఇందులో ఎవరెవరో..

July 16, 2017

డ్రగ్స్ కేసు టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. స్టార్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తొలి జాబితాతోనే ఫిల్మ్ నగర్ అల్లకల్లోలమైతే..ఇప్పుడు రెండో జాబితా సిద్ధమవుతుంది. ఇందులో ఎవరెవరు ఉన్నారో అని సినీ జనుల్లో తెగ టెన్షన్ నెలకొంది.

తెలంగాణ ఎక్సైజ్ శాఖ తయారు చేస్తున్న ఈ జాబితాలో మరికొంతమంది సినీ ప్రముఖుల పేర్లు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నోటీసులు అందుకున్నవారి కదలికలపై సిట్‌ నజర్ పెట్టింది.తమ పేర్లను సిట్ ఎక్కడ బయట పెడుతుందోనని స్టార్లు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటులు నవదీప్, తరుణ్, నందు, సుబ్బరాజు, రవితేజ, చార్మీ, ముమైత్‌ఖాన్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో ఎక్కవ మంది పూరి కంపెనీలోని వారివి కావడం హైలైట్. చూడాలి ప్రచారం జరిగినట్టే పెద్దతలకాయలు రెండో లిస్టు లో ఉంటాయో..లేదో…