టీమిండియా హెడ్ కోచ్ రేస్‌లో ఈ ఆరుగురు - MicTv.in - Telugu News
mictv telugu

టీమిండియా హెడ్ కోచ్ రేస్‌లో ఈ ఆరుగురు

August 13, 2019

 Tom Moody, Mike Hesson and Phil Simmons In Indian Coach Shortlist with Ravi Shastri..

టీమిండియా హెడ్ కోచ్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని బీసీసీఐ సంస్థ క్షుణ్ణంగా పరిశీలించింది. అందులో ఆరుగుర్ని ఇంటర్వూకి ఎంపిక చేసింది. అయితే ప్రస్తుతం కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి దరఖాస్తు చేసుకోకుండానే అతడు ఇంటర్వూకి హాజరయ్యే అవకాశం ఉంది. రవిశాస్త్రితో పాటు న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హసన్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఫిల్ సిమన్స్, ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ, భారత జట్టు మాజీ మేనేజర్ లాల్‌చంద్ రాజ్‌పుత్, టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్‌ ఉన్నారు. హెడ్ కోచ్‌ని ఎంపిక చేసే బాధ్యతను క్రికెటర్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా కమిటీకి నిర్వహిస్తుంది. ఆగష్టు 16న ముంబయిలో వీరందరికీ ఇంటర్వూ నిర్వహించనున్నారు.