వర్స వెట్టి ఏడ్పిస్తున్నవి...... - MicTv.in - Telugu News
mictv telugu

వర్స వెట్టి ఏడ్పిస్తున్నవి……

June 29, 2017

నిత్యావసర వస్తువుల ధరలు జనం మీద పగబట్టనట్లున్నవి. వరుస వెట్టి ఏడ్పిస్తనే ఉన్నవి. దేశ రాజధాని ఢిల్లీ టమాట ధర వింటే దిమ్మదిరిగి పోవాల్సిందే. ఇది వానాకాలం ఇప్పుడు టమాట ధర చానా తక్వ ఉంటది. కానీ అక్కడ మాత్రం కిలో ధర 70 రూపాయల దాంకా ఉందట. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సారి భారీగా కుర్సిన వానలకు పంట సాంతం నష్టం అయిందట. హర్యాణ రాష్ట్రంలో మోతాదుకు మించిన వాన వల్లనే ఈ నష్టమని కేంద్ర మంత్రి పాశ్వాన్ అంటున్నరు. ఇక మన హైద్రాబాద్ల మాత్రం ఏం తక్వ లేదు టామాట ధర. కిలో 45 రూపాయ దాంకా ఉంది. బెంగాల్ లో నైతే 50 రూపాయల పై నుండి దిగి రానే రాన్నంటు న్నదట.

యావరేజ్ గా అన్ని రాష్ట్రాల్లో 40 పైన్నే పలుకుతున్నది. అప్పట్ల కంది పప్పు, ఉప్పు ఉల్లిగడ్డలు ఉత్తరాదిని వణికించాయి. తానేం తక్వ కాదని టామా టా ఆ జాబితల చేరి పోయింది. అయితే బ్లాక్ మార్కెట్ పెరగకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదట.ఎవరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా మల్లా టమాట పంటొచ్చే దాంక జనాల జేబులకు పే…..ద్ద బొక్క పడ్డట్లే.