టమాటాలు తింటే ‘వీర్య’బలులే.. శాస్త్రవేత్తల వెల్లడి - MicTv.in - Telugu News
mictv telugu

టమాటాలు తింటే ‘వీర్య’బలులే.. శాస్త్రవేత్తల వెల్లడి

October 9, 2019

కంప్యూటర్లు, మొబైల్ ఫోన్‌ల ద్వారా ఉత్పత్తయ్యే రేడియేషన్, వృత్తి రీత్యా కలిగే ఒత్తిడి యువకుల్లో వీర్యకణాలను బలహీన పరుస్తోంది. దీంతో యుక్త వయసులోనే సెక్స్ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అలాంటి పురుషులకు యూనివర్సిటీ ఆఫ్ షెఫ్‌ఫీల్డ్ శాస్త్రవేత్తల శుభవార్త తెలిపారు. టమాటాలను తగిన మోతాదులో తీసుకుంటే వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని అలాగే వీర్య కణాల నాణ్యత మెరుగుపడుతుందిని తెలిపారు. 

tomato.

వండిన టమాటాలను అధికంగా తీసుకోవాలని పురుషులకు పరిశోధకులు సూచిస్తున్నారు. రోజుకు రెండు టేబుల్‌ స్పూన్ల టమాట రసం తీసుకుంటే వీర్యం నాణ్యత మెరుగవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. టమాటాలో ఉండే లైకోపిన్‌ అనే రసాయనం వీర్యవృద్ధితో పాటు బీపీని తగ్గిస్తుందని, పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పును నిరోధిస్తుందని నిపుణులు వెల్లడించారు. పరిశోధనలో భాగంగా  లైకోపిన్‌తో రూపొందించిన పిల్‌ను శాస్త్రవేత్తలు కొందరికి రోజుకు రెండుసార్లు ఇచ్చారు. మూడు నెలల తర్వాత వారిలో వీర్యకణాల సంఖ్య వృద్ధి చెందినట్టు గుర్తించారు. టమాటాలను రోజు తీసుకోవడం ద్వారా వీర్యకణాల సంఖ్య, పరిమాణం మెరుగైనట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. టమాటాలు అధికంగా తీసుకున్న పురుషుల్లో సంతాన సాఫల్యత మెరుగవుతుందని స్పష్టం చేశారు.