“టమాటా’’కు సైన్యం కాపలా...! - MicTv.in - Telugu News
mictv telugu

“టమాటా’’కు సైన్యం కాపలా…!

July 23, 2017

అద్దమరాత్రి  అందరూ నిద్రిస్తున్నప్పుడు..ఫ్రిజ్ లో ఉన్న  టమాటాలు ఎత్తుకెళ్లిన దొంగలు,మార్కెట్ వెళ్లి టమాటాలు కొన్కస్తున్న  మహిళను కత్తితో బెదిరించి 2 కిలోల టమాటాలను లాక్కొని పరారైన గుర్తు తెలియన వ్యక్తులు,దేశంలో పెరిగిపోతున్న టమాటా స్నాచర్స్.ఇగో ఇప్పటి పరిస్ధితులను సూస్తుంటే  రాబోయే  రోజులల్ల గిట్లనే ఉండెటట్టున్నయ్ వార్తలు..అందలమెక్కిన తమాటాను అందరు కొనే పరిస్ధితి లేదిప్పుడు,అందుకే  కొందరు టమాటాలను చోరీ చేస్తున్నరు.ముంబయ్ కూరగాయల మార్కెట్లో 300 కిలోల టమాటాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన్రట,ఇగ గ టమాటాలను అమ్మే వ్యాపారి  లబ లబ మొత్తుకుంట  పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండట,పోలీసులు గుడ  కేసు నమోదుచేసి..టమాటా దొంగలకోసం గాలిస్తున్నరట,ఇగ మద్యప్రదేశ్ లోని ఇండోర్ మార్కెట్ కాడ..టమాట ట్రేల కాడ  తుపాకులు వట్టుకొని సైనికులు భద్రత కల్పిస్తున్నరట ఎవ్వడు ఎత్కపోకుంట,టమాటాకు సైన్యం కాపలా అంటే శిత్రమన్పిస్తుంది గదా,గీ లెక్కన జూస్కుంటే.. శేన్ల టమాట పంటేశినోళ్లు  ఇల్లు ఆకిలి  ఇడ్శిపెట్టి  ఇరవై నాలుగంటలు..బార్డర్ల  సైన్యంలెక్క  కాపలా కాస్తున్రా ఏంది, ఏమో మరీ..టమాటానా మజాకా.