తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ ఖాళీల్లో భూగర్భజల విభాగానికి చెందిన పోస్టులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని భూగర్భజల విభాగానికి చెందిన అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్, హైడ్రాలజిస్ట్ తదితర పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి 06-12-2022 తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ రేపటి(27-12-2022)తో ముగియనుంది. ఇప్పటికే చాలామంది నిరుద్యోగులకు ఈ పోస్టులకు దరఖాస్తు చేశారు. మీలో ఎవరైనా ఇంకా ఈ ఉద్యోగాలకు అప్లై చేయనట్లయితే.. ఈ క్రింది వివరాలను మరోసారి పరిశీలించండి..
మొత్తం ఖాళీలు: 32
పోస్టులు: అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్, హైడ్రాలజిస్ట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ ఎమ్మెస్సీ/ ఎంటెక్..
వయసు: 18-44 ఏళ్లు మధ్య ఉండాలి.
జీతం: రూ.45960-రూ.133630.
ఎంపిక: రిక్రూట్మెంట్ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.12.2022 నుంచి
దరఖాస్తుకు చివరి తేదీ: 27.12.2022
వెబ్సైట్: https://websitenew.tspsc.gov.in/notifications