Tomorrow is Virataparvam event..do you know somewhere ..
mictv telugu

రేపే విరాటపర్వం ఈవెంట్..ఎక్కడో తెలుసా..

June 4, 2022

Tomorrow is Virataparvam event..do you know somewhere ..

తెలుగు చిత్రసీమ పరిశ్రమతోపాటు, రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రియులు కొన్ని నెలలుగా ఎంతగానో ఎదురుచూస్తున్న ‘విరాటపర్వం’ సినిమాకు సంబంధించి శనివారం చిత్రబృందం ఓ కీలక విషయాన్ని తెలియజేసింది. కరోనా కారణంగా, భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్‌ల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ, ప్రేక్షకులను తీవ్ర నిరాశలకు గురి చేసిన ‘విరాటపర్వం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రేపు (ఆదివారం) ‘కర్నూల్’ జిల్లాలో నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

ఈ సినిమాలో కథా నాయకుడిగా రానా, ఆయనను ఆరాధించే యువతిగా సాయి పల్లవి నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్, పాటలు ప్రేక్షుకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో.. రానా నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన ‘విరాటపర్వం’ విడుదల చేయనున్నట్టు ఇటీవలే చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎప్పుడు పెట్టాలి? ఎక్కడ పెట్టాలి? అని చర్చలు జరిపి, చివరికి ‘కర్నూల్ జిల్లాలో ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాను వీక్షించిడానికి ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తున్నారు.