రేపు పాఠశాలలు బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

రేపు పాఠశాలలు బంద్

September 27, 2018

ఈనెల 28న  ట్రస్మా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల బంద్‌‌కు పిలుపునిచ్చారు తెలంగాణ రికగ్నైజ్‌డ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ నాయకులు. బందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ట్రస్మాఅధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో 55శాతం విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటున్నారని పేర్కొన్నారు. సంవత్సరానికి సగటున 15వేల ఫీజుతో ప్రైవేటు పాఠశాలలు వారి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు.Tomorrow schools are clousedడిమాండ్లు ఇవి…

– ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థికి రూ.30వేల ఫీజును వారి అకౌంట్స్‌లో జమచేయాలి.

-ప్రైవేటు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు, వారి కుటుంబసభ్యులకు ఆరోగ్యబీమా కల్పించాలి.

-డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి.