నీకు నాకు తేడా లేదంటున్న  టమాట..! ఆపిల్ టమాట భాయ్ భాయ్..! - MicTv.in - Telugu News
mictv telugu

నీకు నాకు తేడా లేదంటున్న  టమాట..! ఆపిల్ టమాట భాయ్ భాయ్..!

July 20, 2017

నిజంగనే టమాటాకు మంచిరోజులచ్చినయ్..ఎట్లంటరా టమాట రేటు అమాంతం పెర్గి  సక్కగ వొయ్యి కొండమీదున్న ఆపిల్ పక్కన కూసుంది,ఇప్పుడు నీకు నాకు తేడా ఏం లేదు అని ఆపిల్ ను ఎక్కిరించే స్థాయికి ఎదిగింది,భారతదేశంల ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో ఒకే ధరకు అటు టమాటాలు ఇటు ఆపిల్ పండ్లు దొర్కుతున్నయంటే  నిజంగ గ్రేటే గదా,ఒకప్పుడు ధరలు లేక్పోతే రోడ్డుమీద అట్టిగ పారవోశ్న  టమాటకు రాజభోగం పట్టినట్టే గదా..

సామాన్య పబ్లిక్కును అందని ద్రాక్షపండ్లలెక్కనే అయిపోయినయ్ ఇప్పుడు టమాటలు,500 రూపాలు పట్కొని మార్కెట్లకు పోతే మూడు నాలుగు కూరగాయలుగుడ రాని పరిస్ధితి,ఉల్లిగడ్డలు కోస్తే కంట్లె నీళ్లస్తయని ఇన్నం గనీ..ఇప్పుడు మార్కెట్లకొయ్యి టమాట ధర వింటే సాలు…ఒక్కొక్కల కండ్లల్ల  వరదలే వారుతున్నయ్,మరేం జేస్తరు  ఏ కూరండినా  అన్ల కాంబినేషన్ టమాట ఉండాల్సిందేనాయే…ఏడ్సుకుంటనైనా కొనాల్సిందే,కిలో 80 గాని 100 గాని మీదనే గాని  కిలో జాగల అద్దకిలోనన్న కొని సరిపెట్టుకుట్టున్నరు, ఇగ కొందరైతే  టమాటాలనేటివి  గొప్పోళ్లు  పైసలున్నోళ్లు  తినేటివి అని అవ్విటి మోఖాన సూసుడే మానేశిన్రు. ఇదేం గాశారమో గనీ  పండించే రైతుకైతే  మంచి దిగుబడి వచ్చినప్పుడు  ధర రాదు …ధర వచ్చినప్పుడు దిగుబడి రాదన్నట్టే అయ్యింది పోన్రి,అటు రైతుకు అచ్చేదిన్ రాలేదు ఇటు కొంటున్న  పబ్లిక్కు అచ్చేదిన్ రాలేదు…కనీ  ముర్గిపోయిన కూరగాయల నడిమిట్ల మగ్గుతున్న  టమాటాకు,కొండమీద గుసున్న ఆపిల్ పక్కన స్థానం అచ్చినందుకు మనం సంతోషిద్దాం, మోడీసారు ఇన్నిరోజులు కష్టపడి  పబ్లిక్కు  అచ్చేదిన్ తేకపోయినా  కనీసం టమాటా  కన్న తెచ్చిండని ఆనందపడదాం,గరీబైన తమాటాను ..అమీర్ అయిన  ఆపిల్ కు  సమానంగ జేశినందుకు సారుకు సలాం జేద్దాం.సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే ఇదేనేమో.

ఇగ పెర్గిన టమాటా మీద నెటిజన్ల సెటైర్లు కామెడీలు మీకోసం..!

1) టమాటాలు తింటున్న వాళ్లు చాలా డబ్బున్నోళ్లట..ఆళ్లమీద ఇన్ కం టాక్స్ రైడ్స్ జరగాల్నట

2) టమాటాలు లేకుంట అన్ని కూరండం వస్తే రూపాయి కట్నం తీసుకోకుండ  పెండ్లి జేస్కుంటరట

3) పైసలు బంగారం ఏడనన్న వెట్కోన్రి …టమాటాలను మాత్రం భద్రంగ వెట్కోన్రి అని ఒకలు

4) చ ఈ యాడాది  టమాట పంటేశ్న ఈసీగ కోటీశ్వరులం అయిపోదుమని ఒగలు..

5) అరేయ్  మీకోసం బిర్యాని వండిన రా కనీ అచ్చేటప్పుడు కిలో టమాటాలు వట్కరా అని ఒకడు…

ఇట్ల నెటిజన్లు అందలమెక్కిన టమాటా మీద ఎవ్వలకు తోశినట్టు వాళ్లు సెటైర్లు పంచులు షేర్ జేస్కుంటున్నరు.