బతికున్న ఎద్దు నాలుకను కోసుకుని తిన్నారు.. - MicTv.in - Telugu News
mictv telugu

బతికున్న ఎద్దు నాలుకను కోసుకుని తిన్నారు..

February 28, 2020

bull tongue.

పొలంలో కట్టేసిన ఎద్దుపై అత్యంత హేయమైన దారుణం జరిగింది. తినడానికి ఇంకేదీ దొరకనట్టు కొందరు దుండగులు ఆ మూగజీవి నాలుకను కోసుకుని తిన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బండా పట్టణ సమీపంలోని లహురేతా గ్రామంలో ఈ నెల 4న జరిగిందీ వికృతం.  

ఎద్దు యజమాని అంబి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాద్ తన పొలంలో ఎద్దును కట్టేసి పక్కనే ఉన్న తన మరో పొలంలోకి వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత తిరిగి వచ్చేసరికి, ఎద్దు బిగ్గరగా రోదిస్తూ కనిపించింది. దాని నోరు నెత్తురోడుతోంది. నాలుకను ఎవరో కోసుకుని ఎత్తుకెళ్లినట్లు ప్రసాద్ కు అర్థమైంది. ఏం చేయాలో తోచక దాన్ని ఇంటికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశాడు. తర్వాత మళ్లీ పొలంలో కట్టేయగా, నాలుకు కోసుకొని వెళ్లిపోయిన వాళ్ల వచ్చి బెదిరించారు. తాము చేసిన పనిని ఎవరికైనా చెబితే నీ నాలుక కోస్తామని బెదిరించారు. ప్రసాద్ భయపడకుండా ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు జంతుహింస కింద కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.