ఎంత కష్టం ఎంత కష్టం పట్నం వచ్చిన పోరగాండ్లకు ! - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత కష్టం ఎంత కష్టం పట్నం వచ్చిన పోరగాండ్లకు !

August 19, 2017

హైదరాబాదు పట్నంల ఎన్ని సిటీ బస్సులు పెంచినా, ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టినా, రేపట్కి మెట్రో రైలు ఉర్కచ్చినా.., ట్రాఫిక్ తిప్పలు పోవు. పోరగాండ్లు ఇట్ల యాలాడుకుంట బస్సుల మీద ఎక్కుడు తప్పదేమో !? వూర్లల్లకెల్లి పోరగాండ్లంత సదువుకోవడానికి సిటీకి వస్తున్నరు. సిటీల ఇగ జనాభ పెరుగుమంటే ఎందుకు పెరుగదు చెప్పుర్రి. ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు కొట్టేవరకు అస్సలు బస్సులల్ల చీమ దూరుదామన్నా సందు దొర్కది. స్కూలు పిల్లలు, కాలేజీలకు పోయే పోరగాండ్లు, ఉద్యోగాలని ఆఫీసులకు పోయే జాబర్స్ అందరూ ఎగవడి ఎగవడి బస్సులల్ల ఉర్కుతుంటరు. టైంకు అందాల్నని కింద మీద పడ్తుంటరు. ఉరుక్కుంట ఉరుక్కుంట బస్సులకు ఇట్ల తొండలు యాలాడవడ్డట్టు యాలాడవడ్తుంటరు.

జర్ర చెయ్యి జారినా, కాలు జారి కింద వడితే ఎంత ప్రమాదమో అందర్కి ఎర్కున్న ముచ్చటనే. కనీ ఇంటరా ఇయాల రేపటి పోరగాండ్లు. కండక్టర్ వచ్చి ‘ అద్దురా పోరగాండ్లని ’ ఎంత మొత్తుకున్నా ఎవ్వరు గూడా ఆయిన మాట అస్సలు ఇనరు. మీదికెల్లి కండక్లర్ మీదనే ఎన్నో జోకులు ఏస్తుంటరు. కొందరు పాసుల్లేకంట గూడా ఉన్నట్టు బిల్డపులిచ్చి బస్సు ఎక్కేస్తుంటరు. ఖర్మగాలి ఆర్ టీవో అస్తున్నడంటే చాలు ఆ ఇరకాటంలోంచి తప్పించుకోవడానికి కిటికీలోంచి ఆపసోపాలు పడుతూ బయటకు దూకి పారిపోతుంటారు. ఇలాంటి వీనుల విందైన దృశ్యాలను చూడాలనుకుంటే ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల మధ్య సిటీలోని ఏ బస్టాపుకి వెళ్ళినా సరిపోతుంది. ఇలాంటి దృశ్యాలను కుప్పలు తెప్పలు చూడొచ్చు. ఈ లెక్ఖన ఆర్టీసీ వాళ్ళు ఇంకొన్ని బస్సులు పెంచి పోరగాండ్ల తిప్పలు తీరుస్తె బాగుండునేమో.