రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశాడు. ”రష్యాపై ఆంక్షలు విధించడం అంటే యుద్ధంతో సమానం. నాటో దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఊహించినదాని కంటే ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం చేస్తాం. మా డిమాండ్లు నెరవేరే దాకా యుద్ధం ఆగదు” అని అన్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలు లేకుండా చేస్తామని, శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని మండిపడ్డారు. అందుకు ఆ దేశం మూల్యం చెల్లించుకోవాల్సిందేనని పుతిన్ వ్యాఖ్యానించారు.
రష్యా దేశంపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తూ పుతిన్‌పై ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రష్యా 6 గంటలపాటు తాత్కలికంగా యుద్ధం విరమించుకుంది. ఇచ్చిన సమయం ముగిసిపోవడంతో మళ్లీ భీకరంగా గర్జిస్తూ, ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురుపిస్తుంది.