tooth-problems-because-of-stress-and-cortisol-harmone
mictv telugu

ఒత్తిడి ఉంటే దంతాలూ పాడవుతాయి

February 22, 2023

 

tooth-problems-because-of-stress-and-cortisol-harmone

ఒత్తిడి చాలా డేంజరస్. దీనివల్ల మానసిక సమస్యలు వస్తాయి, ఈ విషయం అందరికీ తెలిసినదే కానీ దీనివల్ల శారీరక సమస్యలు కూడా వస్తాయి అని చెబుతున్నారు డాక్టర్లు. ఒత్తిడి ఉన్నప్పుడు శరీరంలో కార్టిసిల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దీనివలన గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది చాలా జబ్బులకు దారి తీస్తుందని చెబుతున్నారు.

కార్టిసిల్ హార్మోన్ అన్నింటికన్నీ ఎక్కువగా దంతాల మీద ప్రభావం చూపిస్తుందిట. ఒత్తిడితో బాధ పడుతున్నప్పుడు ఎవ్వరూ తమ మీద తాము శ్రద్ధ చూపరు. అలాంటప్పుడు కార్బోహైడ్రేట్లు, స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. వాటిని ఎక్కువ తీసుకోవడం వలన దంతాల మీద ఫలకాలు ఏర్పడతాయి. అంతేకాదు పీరియాంటైటిస్ అనే చిగుళ్ళ సమస్యకు కూడా దారి తీస్తుంది.

ఒత్తిడితో ఉన్నప్పుడు నోటిలో లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది, దీనివల్ల నోరు పొడిబారుతుంది. లాలాజలం చాలా ఆహార కణాలను తగ్గించడంలో బఫర్ గా పనిచేస్తుంది. దంతాల పునరుద్ధరణకు అవసరమయ్యే ఎంజైమ్ లను కలిగి ఉంటుంది. ఒత్తిడిలో ఉన్నవాళ్ళు ఆల్కహాల్ కూడా ఎక్కువగా తీసుకుంటారు. ఇది కూడా లాలాజలం ఎండిపోవడానికి కారణం అవుతుంది.

అలాగే ఒత్తిడిలో ఉన్నప్పడు దవడలు బిగించడం, పళ్ళు కొరకడం లాంటివి కూడా ఎక్కువ చేస్తుంటారు. దవడలు బిగించడం వలన టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ ఒత్తిడికి గురవుతుంది. దీనివలన దవడ, చెవులు నెప్పెడతాయి. ఇక కార్టిసల్ పెరుగుదల వలన ప్రోటీన్ ఎక్కువగా ప్రేరేపితం అవుతుంది. అప్పడు చిగురువాపు లేదా పీరియాంటైటిస్ వస్తాయి. అలాగే నోటిలో అల్సర్లు కూడా ఎక్కువగా రావడానికి అవకావం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.