Top 10 Best Telugu Movies Released in 2022
mictv telugu

2022 టాలీవుడ్ టాప్ 10 చిత్రాలు..!

December 24, 2022

Top 10 Best Telugu Movies Released in 2022

ఎట్టకేలకు 2022వ సంవత్సరం కూడా పూర్తి కాబోతోంది. ఈ సంవత్సరంలో దాదాపు 100కిపైగా తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. మరి అందులో టాప్ సినిమాలు ఏంటి? బాక్సాఫీస్ దెగ్గర టాప్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలెన్ని, వాటి లెక్కల వివరాలు వంటి అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సూపర్-హిట్ చిత్రం భీమ్లా నాయక్, సిద్ధు జొన్నలగడ్డ DJ టిల్లుతో ఈ సంవత్సరం హిట్స్ ప్రభంజనం స్టార్ట్ అవ్వగా.. హిట్2, ధమాకా వరకు ఏయే తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయో చూద్దాం.

1. ఆర్ఆర్ఆర్

ఈ సంవత్సరం తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరింత పెంచిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పటివరకు ఎవరు ఊహించని కాంబినేషన్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ తెరకెక్కించాలన్న ఆలోచనతోనే సగం హిట్ కొట్టేసాడు రాజమౌళి. మార్చ్ 21న సమ్మర్ కానుకగా పాన్ ఇండియా చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఏకంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి..సూపర్ హిట్గా నిలిచింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోని రూ. 300 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

2. కార్తికేయ 2

ఒక ప్రాంతీయ చిత్రంగా విడుదలై పాన్ ఇండియా రేంజిలో సక్సెస్ కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించిన థ్రిల్లర్ కార్తికేయ 2. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా.. చందు మండేటి దర్శకత్వంలో.. కార్తికేయకి సీక్వెల్ గా ఆగస్టు 13న విడుదలైంది కార్తికేయ 2. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. హిందుత్వ సెంటిమెంట్ నినాదంతో ఈ సినిమా హిందీలో ఏకంగా రూ. 40 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు రూ.60 కోట్లకు పైగా భారీ లాభాలను తెచ్చిపెట్టి నిఖిల్ కెరీర్ నిలిచింది కార్తికేయ 2.

3. భీమ్లా నాయక్

పవన్ కళ్యాణ్, రానాలు కలిసి నటించిన భీమ్లా నాయక్ మంచి మాస్ హిట్ గా నిలిచింది. కరోనా వేవ్, ప్రభుత్వ కుట్రలని తట్టుకుని కేవలం పవన్ కళ్యాణ్ ఛరిష్మాతోనే భారీ వసూళ్ళని కొల్లగొట్టింది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో.. పవన్ ఆత్మ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ చిత్రం 97.80 కోట్ల గ్రాస్ వసూళ్ళని అందుకుంది. అయితే ఆంద్రలో కానీ మరింత మంచి థియేటర్స్ పడి, టికెట్స్ ధరలు కానీ కాస్త పెంచి ఉంటే.. 2022లో నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ అన్ని భీమ్లా నాయక్ ఖాతాలోనే ఉండేవి.

4. గాడ్ ఫాదర్

ఇక తమ్ముడి ప్రభంజనం తరువాత స్తనంలో అన్న మెగాస్టార్ గాడ్ ఫాదర్ నిలిచింది. ఆచార్యతో జరిగిన అవమానం గాడ్ ఫాదర్ తో కాస్తయినా తగ్గినట్టయింది. సల్మాన్ ఖాన్ నటించటంతో పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 95కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

5. హిట్ 2

దర్శకుడు శైలేష్, హీరో నానిల కొత్త ప్రపంచం హిట్ కి సీక్వెల్ వచ్చిన చిత్రం హిట్ 2 బాక్సాఫీస్ దెగ్గర భారీ వసూళ్ళని సృష్టించి 2022లో టాప్ చిత్రాల్లో 6వ స్థానంలో నిలిచింది. ట్యాలెంటెడ్ అడివిశేష్ హీరోగా చేసిన ఈ చిత్రం డిసెంబరు2న విడుదలై ఇప్పటివరకు 43కోట్ల గ్రాస్ వసూళ్ళని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా థ్రిల్లర్స్ ని అభిమానించే ఆడియన్స్ మనసుల్ని గెలిచిన ఈ మూవీ 23కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ షేర్స్ వసూల్ చేసింది.

6. మేజర్

ఇక హీరో అడివిశేష్ వన్ మెన్ షో మేజర్ మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కొట్టింది. 26/11 అటాక్స్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ చిత్రం అన్ని భాషల్లో విడుదలై రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.

7. బంగార్రాజు:

2022 ఉత్తమ చిత్రాల్లో టాప్ 7లో అక్కినేని అందగాళ్ళు నిలిచారు. తండ్రి నాగార్జున, కొడుకు నాగ చైతన్యలు కలిసి చేసిన బంగార్రాజు చిత్రం బాక్సాఫీస్ దెగ్గర భారీ లాభాలని సొంతం చేసుకుంది. సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.37 కోట్లు వసూలు చేసి మంచి విజయం అందుకుంది.

ఇక 2022లో విడుదలైన చిత్రాల్లో మంచి వసూళ్లు సాధించిన మరిన్ని చిత్రాలని గమనిస్తే వరుసగా.. సీతారామం 35కోట్లు, బింబిసార రూ.33 కోట్లు, యశోద 31కోట్లు, డీజే టిల్లు 29కోట్లతో టాప్ లో నిలిచాయి.