సోషల్ మీడియా ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సామాన్యుణ్ణి సైతం సెలెబ్రిటీని చేస్తోంది. సెలెబ్రిటీని ఇంకా సెలెబ్రిటీని చేస్తోంది. అభిమానులకు చేరువగా ఉండటానికి సెలబ్రిటీలకు ఉన్న ఏకైక మార్గం సోషల్‌మీడియా. వ్యక్తిగత విషయాలు, వివిధ సంఘటనలపై అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది వేదికవుతోంది. ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ వంటి యాపుల ద్వారా సెలెబ్రిటీలకు ఫాలోవర్లు చాలా మంది పెరిగిపోతున్నారు. అభిమానులు కూడా తమకు ఇష్టమైన సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలను ఫాలో అవుతూ.. వారి పోస్ట్‌లకు రియాక్షన్స్, కామెంట్స్ ఇస్తుంటారు. ఫేస్బుక్ వేదికగా అత్యధిక మంది అభిమానులు అనుసరిస్తున్న భారత సెలబ్రిటీల జాబితాను విడుదల చేశారు. 15 మందితో కూడిన ఈ జాబితాలో దక్షిణాది నుంచి కథానాయిక కాజల్ అగర్వాల్ ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు ఎవరికెక్కువ ఫాలోవర్లు వుంటే వాళ్ళే తోపు అన్నంత క్రేజు ఏర్పడింది.
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఫేస్బుక్ పేజీని అత్యధికంగా 35.8 మిలియన్ల అనుసరించడం ద్వారా కోహ్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రెండో స్థానంలో సల్మాన్ ఖాన్ (35.3 మిలియన్లు), మూడో స్థానంలో దీపికా పదుకొణె (34 మిలియన్లు) ఉన్నారు. పూర్తి జాబితాను ఓ సారి చూస్తే..
- ప్రియాంక చోప్రా (32.3 మిలియన్లు)
- హనీసింగ్ (30.4 మిలియన్లు)
- సచిన్ టెండుల్కర్ (28.5 మిలియన్లు)
- శ్రేయా ఘోషల్ (28.3 మిలియన్లు)
- అమితాబ్ బచ్చన్ (27.2 మిలియన్లు)
- మాధురీ దీక్షిత్ (26 మిలియన్లు)
- కపిల్‌శర్మ (26 మిలియన్లు)
- సోనాక్షి సిన్హా (23.7 మిలియన్లు)
- అక్షయ్ కుమార్ (23.7 మిలియన్లు)
- షారుక్ ఖాన్ (23.6 మిలియన్లు)
- ఎ.ఆర్. రెహమాన్ (22.8 మిలియన్లు)
- కాజల్ అగర్వాల్ (23.2 మిలియన్లు)