హాలీవుడ్ సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరో టామ్ క్రూజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 60 ఏండ్ల వయస్సులోనూ యాక్షన్ స్టంట్లతో అదరగొట్టే ఈ హీరో అంటే హాలీవుడ్ జనాలకు విపరీతమైన క్రేజ్. ఇటీవల తన సినిమాను సూపర్ హిట్ చేసినందుకు అభిమానులకు వినూత్నరీతిలో కృతజ్ఞతలు చెప్పాడీ హీరో. ఏకంగా విమానంలో నుంచి కిందకు దూకుతూ థ్యాంక్స్ చెప్పాడు. ఆయన నటించిన ‘టాప్ గన్:మెవరిక్’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని కాసుల వర్షం కురిపించింది. ఇంత హిట్‌ను అందించిన ప్రేక్షకులకు స్టంట్ చేస్తూ థ్యాంక్స్ చెప్పాడు టామ్ క్రూజ్. తన అభిమానుల కోసం ఇలా చేసినట్లు స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. హీరో చేసిన విన్యాసాన్ని చూసి అభిమానులు షాక్ అయ్యారు. కామెంట్ల రూపంలో వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఇటువంటి విన్యాసాలు చేయడంలో మీకు మీరే సాటి’ అని ఒకరు అనగా, ‘రియల్ హీరో’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.
A special message from the set of #MissionImpossible @MissionFilm pic.twitter.com/Heyugr0BlJ
— Top Gun (@TopGunMovie) December 18, 2022
టామ్ క్రూజ్ చివరిగా నటించిన టాప్ గన్ మేవరిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటివరకు నష్టాల్లో కూడా సాగుతున్న హాలీవుడ్ ఇండస్ట్రీకి ఆ సినిమా సూపర్ బూస్ట్ ఇచ్చింది. అయితే ఆ సినిమాకు అంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఈ హీరో ఇదివరకే చాలాసార్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే టామ్ క్రూజ్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసిన మూవీ ఫ్రాంచేజీ మిషన్ ఇంపాజిబుల్. ఈ సిరీస్ నుంచి ఒక సినిమా వస్తుందటే సినీ ప్రియులకు పండగే. 1996లో స్టార్ట్ అయిన ఈ మూవీ ఫ్రాంచైజీ నేటికి కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు సినిమాలు వచ్చి తెగ అలరించడమే కాకుండా అత్యధిక వసూళ్లు సాధించి రికార్డ్ నెలకొల్పాయి. ఇప్పుడు తాజాగా ఏడో సినిమాగా మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ రానుంది.
ఇవి కూడా చదవండి :
నాగార్జున కి బిగ్ షాక్.. హోస్టుగా బాలకృష్ణ ?
ఆర్ఆర్ఆర్ కి షాక్.. బుక్ మై షో బెస్ట్ ఇండియన్ మూవీస్