హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (36) ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. 10 రోజుల ముందుగానే ఆమె ఆత్మహత్యకు ప్లాన్ చేసుకున్నట్లు పోలీసుల తాజా దర్యాప్తులో వెల్లడైంది. నొప్పి లేకుండా సునాయాసంగా ప్రాణాలు వదలడం ఎలా అని ఇంటర్నెట్లో సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొద్ది వారాల పాటు దీనిపై ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన ప్రత్యూష.. చివరకు కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. గాలి బయటకు వెళ్లని వాష్‌రూమ్‌లో చార్కోల్ను మండించడం ద్వారా విడుదలైన కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్లే ప్రత్యూష చనిపోయినట్లు తేల్చారు.
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన విషయాల ప్రకారం.. ప్రత్యూష తాను నడుపుతున్న బొటిక్‌కి .. ఓ కార్పెంటర్‌ను పిలిపించి, వాష్‌రూమ్‌లోని కిటికీ, వెంటిలేటర్‌ను పూర్తిగా క్లోజ్ చేయించింది. ఆ తర్వాత ఇదే వాష్ రూమ్‌లో ప్రత్యూష కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడింది. ముందస్తు ప్లాన్‌తోనే ప్రత్యూష వాష్‌రూమ్ కిటికీ, వెంటిలేటర్ మూసివేయించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొటిక్‌లో దొరికిన సూసైడ్ నోట్ కాక ఆమె పెన్ డ్రైవ్‌లో మరింత క్లుప్తంగా మరో సూసైడ్ నోట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ నోట్‌ను విశ్లేషిస్తున్నారు. డిప్రెషన్, ఒంటరితనం వల్లే ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.