ఎండల్లోనూ మనమే గ్రేట్.. 15 అగ్నిగుండాల్లో 10 మన దేశంలోనే
సూర్యుడు ప్రపంచంపై నిప్పులు చెరుగుతున్నాడు. చెట్టూచేమా కాలిపోతున్నాయి. మనదేశంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎంత ఎండకైనా తట్టుకుంటాం గాని, వానకు తట్టుకోలేమన్న నానుడి తిరగబడుతోంది. ఎంత వానైనా తట్టుకుంటాంగాని ఈ ఎండను భరించలేమంటున్నారు ప్రజలు. ఒకపక్క ఎండలు, మరోపక్క కరోనా భయంతో నిజంగా నరకం అనుభవిస్తున్నారు.
ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన 15 ప్రాంతాల్ల 10 మనదేశంలోనే ఉన్నాయి. ఎల్ డొరాడో అనే వాతావరణ పోర్టల్ సేకరించిన లెక్కల ప్రకారం.. రాజస్తాన్‌లోని చురూ ప్రాంతం 50 డిగ్రీల సెల్సియస్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాత ఢిల్లీ 47.6, బికనెర్ 47.4, గంగానగర్ 47, ఝాన్సీ 47, పిలానీ 46.9 డిగ్రీల సెల్సియస్ వేడితో ర్యాంకులు కొట్టేశాయి. నాగ్‌పూర్ సోనేగావ్‌లో46.8, అకోలాలో 46.5 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయ. లిస్టులో బాందా(యూపీ), హిసార్(హరియాణా) కూడా చోటు దక్కించుకున్నాయి. ప్రజలే అవసరమైనేత తప్ప వీధుల్లోకి వెళ్లాలని, చల్లనీరు తాగడం, గొడుగుల వాడడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.