top heroes did not help me financially: Pavala Shyamala
mictv telugu

మహేశ్ బాబు, ప్రభాస్, రాంచరణ్‌లు నాకు డబ్బు ఇవ్వలేదు

November 19, 2022

నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆర్టిస్టులలో పావలా శ్యామల ఒకరు. నాటకాల తర్వాత సీరియల్స్ చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పావలా అనే నాటకం బాగా ఫేమస్ అవడం వలన అది ఆమె ఇంటి పేరు అయింది. తనదైన మార్కు నటన, హావభావాలతో పాత్ర ఏదైనా తన ముద్ర వేస్తారు. అలాంటి శ్యామలకు ఈ మధ్య ఆఫర్స్ రావడం లేదు. వయసు పైబడడంతో ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. దాంతో పాటు ఆమె కూతురు కూడా అనారోగ్యానికి గురైంది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అగ్ర హీరోలు తనకు లక్షల రూపాయలు సాయం చేశారనే వార్త బయల్దేరింది.

ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో పావలా శ్యామల స్పందించారు. ‘నేను కష్టాల్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. సొంత డబ్బులతో ‘మా’లో సభ్యత్వం ఇప్పించి ప్రతీనెలా కొంత డబ్బు వచ్చేలా చేశారు. కానీ, మహేశ్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్‌లు నాకు తలా పది లక్షల రూపాయలు ఇచ్చారని, నేను హాయిగా ఉన్నట్టు ఎవరో ప్రచారం చేశారు. అది నిజం కాదు. దీని వల్ల నాకు చిన్న మొత్తంలో సాయం చేయాలనుకునేవారు కూడా వెనక్కి వెళ్తున్నారు. నాకు ఎవరి సాయం దక్కకూడదని ఓ మహాతల్లి ఇదంతా చేసింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.