నేడు భారత్-చైనా ఉన్నతాధికారుల భేటీ - MicTv.in - Telugu News
mictv telugu

నేడు భారత్-చైనా ఉన్నతాధికారుల భేటీ

July 14, 2020

bn

గత కొన్ని రోజులుగా లద్ధాఖ్ కేంద్రంగా ఇండియా-చైనా భద్రతా దళాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెల్సిందే. దీంతో ఇరు దేశాల ఉన్నతాధికారులు చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తాజాగా ఈరోజు వాస్తవాధీన రేఖ వద్ద నుంచి బలగాలను వెనక్కి మళ్లించే విషయమై భారత్‌-చైనా సైన్యాల లెఫ్టినెంట్‌ జనరళ్ల మధ్య సమావేశం జరగనుంది. 

తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుషూల్‌లో ఈ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో సరిహద్దుల్లో ఉద్రిక్తతలను శాంతింపజేయడం, బలగాల ఉపసంహరణ తదితర అంశాలపై విధివిధానాలను ఖరారు చేయనున్నారు. ఈ మేరకు సోమవారం భారత ప్రభుత్వవర్గాలు తెలిపాయి. చైనా సైన్యం ఇప్పటికే గోగ్రా, హాట్‌ స్ప్రింగ్స్‌, గల్వాన్‌లోయ నుంచి వెనక్కి మళ్లింది. ఫింగర్‌-4, పాంగాంగ్‌ సరస్సుల వద్ద సైనికుల సంఖ్యను తగ్గించింది.