షారూఖ్ ఖాన్ అంటే కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అతని పాపులారిటీ ఉంది. కింగ్ ఖాన్ అని పిలువబడే ఈ నటుడు ఇప్పుడు భారతీయ ధనవంతుల జాబితాలో చేరిపోయాడు.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేమిస్తారు. హై – యాక్షన్ త్రిల్లర్ చిత్రం పఠాన్ తో తెర పై పునరాగమనం చేయనున్నాడు. ఇప్పుడు నటుడు ప్రపంచంలోని అత్యంత సంపన్న నటుల్లో 4వ స్థానంలో నిలిచాడు. టాప్ 8వ స్థానాల్లో షారూఖ్ ఒక్కటే పేరు నిలుపుకున్నాడు. మిగతా లిస్ట్ ఒకసారి చూడండి.
ఆ లిస్ట్..
1. జెర్రీ సీన్ ఫెల్డ్ : 1 బిలియన్ డాలర్లు
2. టైలర్ పెర్రీ : 1 బిలియన్ డాలర్లు
3. డ్వేన్ జాన్సన్ : 800 మిలియన్ డాలర్లు
4. షారూఖ్ ఖాన్ : 770 మిలియన్ డాలర్లు
5. టామ్ క్రూజ్ : 620 మిలియన్ డాలర్లు
6. జాకీ చాన్ : 520 మిలియన్ డాలర్లు
7. జార్జ్ క్లూనీ : 500 మిలియన్ డాలర్లు
8. రాబర్ట్ డి నీరో : 500 మిలియన్ డాలర్లు
షారూఖ్ ఆస్తులు..
57యేండ్ల నటుడు ఐసీఐసీఐ, బైజ్యూస్, బిగ్ బాస్కెట్, లక్స్, హుండయ్.. ఇలా 14 బ్రాండ్లకు పని చేస్తున్నాడు. ఇవికాకుండా.. ప్రొడక్షన్ హౌస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్ మెంట్, బద్లా, నెట్ ఫ్లిక్స్ ఒరిజనల్, బార్డ్ ఆఫ్ బ్లడ్ వంటి అధిక వసూళ్లతో ముందంజలో ఉన్నాడు. ఫోర్భ్స్ డేటా ప్రకారం షారూఖ్ సగటు వార్షిక ఆదాయం 38 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు 313 కోట్ల రూపాయలు. 2018లో 13వ స్థానంలో, 2019లో 6వ స్థానంలో నిలిచాడు షారూఖ్. కేవలం ఇవేకాకుండా.. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టును కూడా కలిగి ఉన్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్, వెస్టిండీస్ దేశవాటీ టీ 20 జట్టు టీ అండ్ టీ నైట్ రైడర్స్ కు అధినేతగా ఉన్నాడు బాలీవుడ్ బాద్ షా!