భారత్‌లో భారీగా అమ్ముడుపోతున్న మందు బ్రాండ్లు ఇవే.. - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో భారీగా అమ్ముడుపోతున్న మందు బ్రాండ్లు ఇవే..

July 1, 2022

దేశంలో రోజురోజుకీ మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజల ఆదాయం పెరుగుదల, జీవన శైలిలో మార్పులు వంటివి మద్యం సేవించడానికి ముఖ్య కారణాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 బ్రాండ్స్ ఏవో లెక్కల వారీగా చూద్దాం.

1. మెక్ డోవెల్స్ నెం1 విస్కీ : ఎంసీ విస్కీగా జనాదరణ పొందిన ఈ బ్రాండు పేరుకు తగ్గట్టుగానే వరుసగా మూడో ఏడాది నెం 1 స్థానంలో నిలిచింది. యునైటెడ్ స్పిరిట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కంపెనీ 2020లో 25.7 మిలియన్ కేసులు, 2021లో 30.1 మిలియన్ కేసులను విక్రయించింది.

2. ఇంపీరియల్ బ్లూ : ఐబీ పేరుతో ఫేమస్ అయిన ఈ బ్రాండు అమ్మకాలు 2020లో 21.3 మిలియన్ కేసులను మాత్రమే విక్రయించింది. గతంతో పోలిస్తే అమ్మకాలు పడిపోయాయి. 2021లో 24.1 మిలియన్ కేసులను విక్రయించి రెండో స్థానంలో నిలిచింది.

3. ఆఫీసర్స్ చాయిస్ : ఓసీ పేరుతో పలికే ఈ బ్రాండు కరోనాకు ముందు 30 మిలియన్ల కంటే ఎక్కువ అమ్మకాలు కొనసాగించింది. తర్వాత తగ్గుతూ 2020లో 20.8 మిలియన్ కేసులు, 2021లో కొంచెం పెరిగి 23.2 మిలియన్ కేసులను విక్రయించింది.

4. రాయల్ స్టాగ్ : దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వాడే ఈ బ్రాండు కరోనా ముందు రికార్డులను చెరిపేసింది. 2020లో 18.5 మిలియన్ల కేసులు 2021లో 22.4 మిలియన్ల కేసులు అమ్ముడుపోయాయి.

5. హైవార్డ్స్ బీర్ : వేసవిలో ఎక్కువగా అమ్ముడుపోయే ఈ బీరు 2020లో 9.7 మిలియన్ల కేసులు 2021లో 12 మిలియన్ కేసులు విక్రయించింది.

6. 8పీఎం : ఈ బ్రాండు 2020లో 9.4, 2021లో 11.4 మిలియన్ కేసులు విక్రయించబడ్డాయి.

7. బ్లెండర్ స్ప్రైడ్ : మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వారు ఎక్కువగా వినియోగించే ఈ బ్రాండు చాలా వేగంగా మార్కెటుని సంపాదించుకుంది. 2020లో 6.6 మిలియన్ కేసులు, 2021లో 8 మిలియన్ కేసులు అమ్ముడుపోయింది.

8. బ్యాగ్ పైపర్ : ఎగువ మధ్యతరగతి ప్రజలు ఇష్టపడే ఈ బ్రాండు 2020లో 5.3 మిలియన్లు, 2021లో 5.6 మిలియన్ల కేసులు విక్రయించింది. దీనికి కొంచెం ధర ఎక్కువ.

9. రాయల్ ఛాలెంజ్ : ఈ మధ్యనే వినియోగదారుల అభిమానాన్ని చూరగొన్న ఈ బ్రాండు 2020లో 4.3, 2021లో 4.7 మిలియన్ల కేసులు విక్రయించింది.

10. ఓల్డ్ టావెర్న్ : యునైటెడ్ స్పిరిట్స్‌కి చెందిన ఈ బ్రాండు 2020లో 4.5, 2021 లో 4.4 మిలియన్ కేసులు అమ్మింది. కాగా, పైన పేర్కొన్న పది బ్రాండ్లలో సగం యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీకి చెందినవే ఉన్నాయి.