క్లీన్‌స్వీప్‌పై టీం ఇండియా గురి..! - MicTv.in - Telugu News
mictv telugu

క్లీన్‌స్వీప్‌పై టీం ఇండియా గురి..!

August 30, 2019

Team India ..

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను, టీ20 క్రికెట్‌ సిరీస్‌లను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టెస్ట్‌ సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేయడానికి రెడీ అయింది. మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో 318 పరుగులతో వెస్టిండీస్‌ను ఓడించిన టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో పటిష్టంగా ఉంది. రహనే, విహారి, కోహ్లీ ఫామ్‌లో ఉండగా.. కేఎల్‌ రాహుల్‌ ఫర్వాలేదనిపిస్తున్నాడు. 

మిస్టర్‌ డిపెండబుల్‌ పుజరా ఫామ్‌లోకి వస్తే టీమిండియాకు ఇక తిరుగుండదు. మొదటి టెస్ట్‌లో విఫలమైన మయాంక్‌ స్థానంలోకి రోహిత్‌ శర్మ వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్‌లో టీమిండియా మంచి ఫామ్‌లో ఉంది. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా.. విండీస్‌ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఇషాంత్‌, షమీ సైతం తమ ఫాస్ట్‌ బౌలింగ్‌తో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులు పెడుతున్నారు. మరో వైపు విండీస్‌ టీమ్‌లో  బౌలర్లు ఫర్వాలేదనిపిస్తున్నా..బ్యాట్స్‌మెన్‌ మాత్రం విఫలమవుతున్నారు. టీమిండియా ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న చివరి టెస్ట్ మ్యాచ్‌ను కూడా గెలచి సిరీస్ ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది.