'Toppers' Institute Released 'Key' Paper for Telangana SI Preliminary Exam
mictv telugu

తెలంగాణ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష.. ‘కీ’ పేపర్ విడుదల చేసిన ‘టాపర్స్’!

August 8, 2022

తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆదివారం నిర్వహించిన ప్రిలిమిన‌రీ పరీక్ష ప్ర‌శాంతంగా ముగిసింది. రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 2,47,217 మంది అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,25,759 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 91.32 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 2,25,759 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు తెలిపింది. పరీక్ష కోసం హైదరాబాద్‌ సహా పరిసర ప్రాంతాల్లో 503 పరీక్ష కేంద్రాలు, మిగిలిన జిల్లాల్లో 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రిలిమినరీ పరీక్ష కీ విషయంపై సైతం రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ని www.tslprb.in లో ఉంచుతామని బోర్డు పేర్కొంది. ఈ ప‌రీక్ష‌కు సంబంధించి.. కోడ్‌ ‘C’ పేపరు ‘కీ’ని హైద‌రాబాద్‌లోని మేడిప‌ల్లిలో గ‌ల టాప‌ర్స్‌ ఇన్‌స్టిట్యూట్ రూపొందించింది. ఈ కీ కేవ‌లం అభ్య‌ర్థుల అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే అని గమనించగలరు.

ఇదిలా ఉంటే.. ఈ పరీక్ష హాజరయిన అభ్యర్థులకు ఎలాంటి అవకతవకలు జరగకుండా బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి వేలిముద్రలను నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ప్రిలిమ్స్ పరీక్షలో ఈ సారి నెగెటివ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అభ్యర్థులు తప్పు సమాధానానికి 0.25 మార్కులను కోల్పోతారు. దీంతో అభ్యర్థుల్లో కాస్త ఆందోళన వ్యక్తం అవుతోంది. 60 మార్కులు సాధించిన వారు ఫిజికల్ టెస్ట్ కు అనుమతించబడుతారు. ఆ టెస్ట్ లో అర్హత సాధించిన వారు తుది రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.