కొత్తగూడెంలో తెల్లతాబేళ్ల దండు.. - MicTv.in - Telugu News
mictv telugu

కొత్తగూడెంలో తెల్లతాబేళ్ల దండు..

November 24, 2019

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద సంఖ్యలో తాబేళ్లు రోడ్లపైకి వచ్చి కలకలం రేపాయి. ఎన్నడూ ఒకటి కూడా కనిపించని ప్రాంతంలో తాబేళ్లు ఒక్కసారిగా చీమల దండులాగా గుంపులు గుంపులుగా వచ్చాయి. వాటి  చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు. వాటిని పట్టుకునేందుకు ఎగబడ్డారు. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి – తిమ్మంపేట మార్గం మధ్యలో ఆదివారం ఇది జరిగింది. సుమారు వెయ్యికి పైగా తాబేళ్లు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.   

Kothagudem.

తాబేళ్లను అక్రమ రవాణా చేసే ముఠా ఈ పని చేసినట్టుగా అనుమానిస్తున్నారు. పోలీసులకు పట్టుబడతామనే భయంతోనే వాటిని రోడ్డుపై పడేసి పోయి ఉంటారని అంటున్నారు. కూలి పనికి వెళ్లేవారు ఉదయం పూట వీటిని గుర్తించారు. దీంతో స్థానికులు తాబేళ్ల కోసం ఎగబడుతుండటంతో ఇక్కడ కోలాహలం నెలకొంది.