ఫోన్ల టచ్ స్క్రీన్లు పగిలిపోతూ తరచూ జేబులు ఖాళ్లీ చేస్తుంటాయి. ఇకపై అలాంటి బాధలు ఉండవు. ఏంత ఘోరంగా వాడినా, భళ్లున కిందపడిపోయినా పగిలిపోని టట్ స్క్రీన్లను సిద్ధం చేశారు.
ఫ్లెక్సిబుల్ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌గా పిలిచే వీటిని ఇంగ్లండ్‌లోని ససెక్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుత టచ్స్క్రీన్ల తయారీలో వాడుతున్న ఇండియమ్ టిన్ ఆక్సైడ్ పెళుసుగా ఉంటుంది. పైగా దీని ధర కూడా ఎక్కువ. దీంతో సిల్వర్, గ్రాఫీన్, ఇతర పదార్థాలను కలిపి పగలిపోని స్క్రీన్లను తయారు చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు. సిల్వర్ ధర కూడా ఎక్కువే అయినా, నానోవైర్లను గ్రాఫీన్‌కు జతచేసి వీటిని రూపొందించామన్నారు. ఇవి తక్కువ విద్యుత్ వాడుకుంటాయని, ధర కూడా తక్కువేనని చెప్పారు.