కుక్కల్ని తాకొచ్చు, బొద్దింకను నలపొచ్చు: రాహుల్ గాంధీ - MicTv.in - Telugu News
mictv telugu

కుక్కల్ని తాకొచ్చు, బొద్దింకను నలపొచ్చు: రాహుల్ గాంధీ

April 9, 2022

bnng

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం కొప్పుల రాజు సంపాదకత్వంలో వచ్చిన ‘దళిత్ ట్రూత్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ”ప్రపంచంలో ఎక్కడా లేని దారుణం మన దేశంలోనే ఉంది. కుక్కల్ని పెంచుకుంటాం, కానీ సాటి మనిషిని ముట్టుకోం. ఇదేమీ దారుణమో ఇప్పటికీ అర్థం కావటం లేదు. కుక్కల్ని తాకొచ్చు, బొద్దింకలను నలపొచ్చు. కానీ మనిషిని మాత్రం ఎందుకు తాకకూడదు” అని ప్రశ్నించారు.