A tourist fell into a valley giving chips to a monkey
mictv telugu

కోతికి చిప్స్ అందించబోయి లోయలో పడ్డ టూరిస్ట్

June 28, 2022

A tourist fell into a valley giving chips to a monkey

కోతికి చిప్స్ అందిస్తూ ఓ టూరిస్ట్ లోయలో పడిపోయాడు. మహారాష్ట్ర మహాబలేశ్వర్- ప్రతాప్గఢ్ ఘాట్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ కు చెందిన సందీప్ ఓంకార్ (33).. ప్రస్తుతం పుణెలోని బావ్దాన్ లో ఉంటున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి హరిహరేశ్వర్ నుంచి మహాబలేశ్వర్ కు వెళ్తున్నాడు. అంబెన్లీ ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వీరు.. జనని మాత మందిరం సమీపంలోని ఓ లోయ వద్ద కోతులను చూశారు. ఈ క్రమంలోనే సందీప్.. కోతులకు చిప్స్ అందించేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా కాలుజారి వంద అడుగుల లోయలోకి పడిపోయాడు.

అయితే, వెంటనే స్థానిక ట్రెక్కర్లు, మహాబలేశ్వర్ పోలీసులకు సమాచారం అందింది. ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు ప్రారంభించి.. బాధితుడి జాడ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. వర్షంతో పాటు దట్టంగా పొగమంచు అలుముకున్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించారు. మూడు గంటల పాటు శ్రమించి.. సందీప్ను బయటకు తీశారు. వెంటనే మహాబలేశ్వర్ రూరల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం సతారా జిల్లా ఆస్పత్రికి పంపించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.