అనకాపల్లి సెజ్‌లో గ్యాస్ లీక్.. ఉద్యోగులకు అస్వస్థత - MicTv.in - Telugu News
mictv telugu

అనకాపల్లి సెజ్‌లో గ్యాస్ లీక్.. ఉద్యోగులకు అస్వస్థత

June 3, 2022

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లో గ్యాస్ లీక్ అయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. క్వాంటం, సీడ్స్‌ యూనిట్‌లోకి ఒక్కసారిగా ఘాటైన వాయువు వెలువడింది. దీంతో పలువురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సమీప పోరస్‌ కంపెనీ నుంచి వాయువు వెలువడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాంతులు, తల తిరుగుడుతో ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నలుగురు మహిళలకు సెజ్ యాజమాన్యం చికిత్స అందిస్తోంది.

అయితే పక్కనే ఉన్న కంపెనీ నుంచి అమ్మోనియో గ్యాస్ లీక్ అయ్యిందని యాజమాన్యం చెబుతోంది. అమోనియా పీల్చడంతో మహిళలు స్పృహ తప్పిపోయారని.. ప్రాణాపాయం ఉండదని వైద్యసిబ్బంది చెబుతున్నారు. మరోవైపు పోరస్‌ కంపెనీలో అమోనియా లీకేజీని నిర్ధారించిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు.. దాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.