ఉత్తమ్ కెప్టెన్ ఇన్నింగ్స్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఉత్తమ్ కెప్టెన్ ఇన్నింగ్స్..!

July 17, 2017

2019 ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడబోతున్నారు. పంజాబ్ ఫార్ములాను పక్కాగా అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి కాంగ్రెస్ నే తీసుకుపోతున్నారు. నేతలందరినీ కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ కాంగ్రెస్ కలిసి వస్తుందా..?

తెలంగాణలో ఇప్పుడు రెండు పార్టీలదే హవా. ఉంటే టీఆర్ఎస్..లేదంటే కాంగ్రెస్.. మిగతా పార్టీలన్ని అంతంతే.2019 ఎన్నికల్లోనూ పోటీ ఈ రెండు పార్టీల మధ్యే వుంటుంది. టీఆర్ఎస్ కు బలమైన పోటీ ఇచ్చే పార్టీ కాంగ్రెస్సే.అందుకే తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అవకాశం దొరికిందంటే టీఆర్ఎస్ సర్కార్ ని ఎక్కేస్తున్నారు.సునిశిత విమర్శలు చేస్తూ బలంగా ప్రజల వాదనను వినిపిస్తున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుతూ ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నారు.

ఆయన మాటే విమర్శల తూటా .ప్రత్యర్థుల గుండెల్లోకి పదునైన విమర్శల బాణాల్ని దింపుతారు.నిత్యం పార్టీ కోసం శ్రమిస్తూ కాంగ్రెస్ కు అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇక ఆయన ప్రొఫైల్ ని ఒకసారి పరిశీలిస్తే… 1962లో జన్మించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇండియన్ ఎయిర్స్ లో పైలట్ గా సేవలు అందించారు.మిగ్ 21.23 విమానాలను డీల్ చేశారు. 1994లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆతర్వాత క్రీయాశీల రాజకీయాల్లోకి వచ్చి కోదాడ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో హుజురునగర్ నుంచి విజయం సాధించారు. 610 జీవో కమిటీ చైర్మన్ గా ఉత్తమ్ పనిచేశారు. శాసనసభా అంచనాల కమిటీ చైర్మన్ కూడా సేవలందించారు.రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2014లోకూడా హుజురునగర్ నియోజకవర్గం నుంచే మళ్లీ గెలిచి ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిరెడ్డి కూడా ఎమ్మెల్యేనే. దేశంలోనే ఒకే సభకు ప్రతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే భార్యభర్తలు వీళ్లు. ఇంట్లోనే కాదు రాజకీయాల్లోనూ ఆయనకు ఆమె తోడుగా ఉంటున్నారు. పద్మావతిరెడ్డి కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.1967, జూన్ 17న హైదరాబాద్ లో జన్మించిన పద్మావతీ ఆర్కిటెక్చర్ లో పట్టభద్రురాలు. హైదరాబాద్ లోని జవహార్ లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయంలో బీటెక్ , బెంగుళూర్ లో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సును చదివారు. 1990లో ఉత్తమ్ ను వివాహం చేసుకున్నారు. 2014 లో కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇలా ఒకే సభలో ఉన్న ఉత్తమ్ , పద్మావతీ రెడ్డిలు 2019 లో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలో తెచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు. పంజాబ్ ఫార్ములా తుచ తప్పక అమలు చేయబోతున్న ఉత్తమ్…పార్టీ నేతలందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి ఉత్తముడి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో…