ఈ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా..!? రేవంత్ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా..!? రేవంత్

June 14, 2022

హైదరాబాద్‌లో మెహిదీపట్నం సమీపంలోని ఆసిఫ్‌నగర్‌లో గంజాయి సేవించిన యువకులు అర్ధరాత్రి గందరగోళం సృష్టించిన ఘటనపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యం మన హైదరాబాద్ లోనే అంటూ ట్వీట్ చేశారు. ఆసిఫ్ నగర్ లో మందుబాబులు పోలీసు వాహనం ఎక్కి వీరంగం వేసిన వీడియోను పోస్ట్ చేశారు. వాహనం అద్దాలు ధ్వంసం చేశారని మండిప‌డ్డారు. మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు దాటి.. పోలీసు వాహనాలపై దాడులు చేసే స్థాయికి పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హైదరాబాద్ నగరాన్ని.. ఈ పాలనను ఇలాగే వదిలేద్దామా..!? అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. పౌర సమాజం రాష్ట్రంలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌పై ఆలోచన చెయ్యాలని రేవంత్ రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

నిన్న అర్ధరాత్రి ఆసిఫ్‌నగర్‌లో గంజాయి సేవించిన మ‌త్తులో కొందరు యువకులు పోలీసు వాహ‌నం పై ఎక్కి నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే.. స్థానిక స‌మాచారంతో ఘ‌ట‌న స్థలికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులో తీసుకునే ప్రయ‌త్నం చేయ‌గా వాహనంపైకి ఎక్కి గొడవ చేశారు. పోలీసు వాహనంతో పాటు ఇతర వాహనాల అద్దాలు పగలగొట్టారు. స్థానికుల సహాయంతో గంజాయి గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు పోలీసులు. అయితే.. ఈ క్రమంలో కొందరు తప్పించుకోగా.. అజయ్‌ అనే యవకుడిని అసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.