పరీక్షలు జరపకుండానే గ్రీన్ జోన్ అంటారా?..కేసీఆర్‌పై ఉత్తమ్ ఫైర్
సోమవారం రోజున సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియూలు మినహా అన్నీ గ్రీన్ జోన్లే అని తెలిపిన సంగతి తెల్సిందే. అయితే, కరోనా పరీక్షలు చేయకుండానే సూర్యాపేటను కరోనా రహిత జిల్లాగా ఎలా ప్రకటిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సూర్యాపేటతో పాటు రాష్ట్రంలో ఏప్రిల్ 22 నుంచి ఇప్పటి వరకు ఎన్ని కరోనా పరీక్షలు చేశారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రాథమిక అనుమానితులకు కరోనా పరీక్షలు చేసి, లక్షణాలు లేని రోగులకు చేయడం లేదంటూ సంకినేని వరుణ్‌రావు అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం హైకోర్టు విచారించింది.
మీ ఇష్టమొచ్చినట్టు రంగులు మార్చడం మీ రాజకీయంలో నడుస్తదేమో, కరోనాతో కాదు. టెస్టులు చేయకుండా సూర్యాపేటను గ్రీన్ జోన్ గా ఎట్లా నిర్ధారించారు? టెస్టుల విషయంలో హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాదు. మీకు చేత కాదు, మేము సలహాలిస్తే వెటకారం చేస్తారు! pic.twitter.com/MEKiTG7zbF
— Uttam Kumar Reddy (@UttamTPCC) May 19, 2020
ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. 'మీ ఇష్టమొచ్చినట్టు రంగులు మార్చడం మీ రాజకీయంలో నడుస్తదేమో, కరోనాతో కాదు. టెస్టులు చేయకుండా సూర్యాపేటను గ్రీన్ జోన్ గా ఎట్లా నిర్ధారించారు? టెస్టుల విషయంలో హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాదు. మీకు చేత కాదు, మేము సలహాలిస్తే వెటకారం చేస్తారు!' అంటూ ఉత్తమ్ కుమార్ ట్విట్టర్ లో విమర్శించారు.