గతంలో భాగ్యలక్ష్మితో , ఇప్పుడు శివలింగంతో.. బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

గతంలో భాగ్యలక్ష్మితో , ఇప్పుడు శివలింగంతో.. బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్

May 30, 2022

మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నదని , ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఈ రోజు గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో.. శివలింగాల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నదని, గతంలో భాగ్యలక్ష్మి అమ్మవారి పేరుతో ఓట్లు దండుకున్నారని, పురాతన ఆలయాలకు కేంద్రం ఒక్క రూపాయి ఇచ్చిందా అని ప్రశ్నించారు. ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలను ఎప్పుడు వేస్తారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ని ప్రశ్నించారు. డబ్బులు జమచేసే వరకు తాము ఇలానే ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీ వచ్చినప్పుడు తెలంగాణ అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజి అడిగే ప్రయత్నం చేసారా? అని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోదీ అప్పుల పాలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, హిందు, ముస్లిం, క్రైస్తవుల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.