రెండు చక్రాల ట్రాక్టర్ తోలిన తోపు డ్రైవర్.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

రెండు చక్రాల ట్రాక్టర్ తోలిన తోపు డ్రైవర్.. ఆనంద్ మహీంద్ర ట్వీట్

May 4, 2020

Tractor Running On 2 Wheels Enthralls Anand Mahindra; Industrialist Adds Hope For Economy

కేవలం రెండు చక్రాల సాయంతో నడుస్తున్న ట్రాక్టర్‌కు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ముందు ఒక  చక్రం, వెనక ఒక చక్రం మాత్రమే ఉన్నాయి. అయినా ఆ ట్రాక్టర్‌ను ఓ వ్యక్తి రోడ్డు మీద వేగంగా నడిపిస్తున్నాడు. అతడు నిబంధనలు ఉల్లంఘించాడు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఈ వీడియో నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. రెండు చక్రాలు లేనప్పటికీ మనం కూడా దేశ ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా బ్యాలెన్సు చేసుకుంటూ ముందుకు పోగలం అనిపిస్తోంది’ అని ఆనంద్ మహీంద్రా స్టేటస్ పెట్టారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

కోటి మందికి పైగా నెటిజన్లు దీన్ని వీక్షించారు. ఏ మాత్రం బ్యాలన్స్ తప్పకుండా అతడు ట్రాక్టర్ నడిపిన తీరు వారిని విపరీతంగా అలరిస్తోంది. డ్రైవింగ్‌లో అతనికి  చాలా ప్రావీణ్యం ఉన్నట్టుంది.. అందుకే అంత అలవోకగా రెండు చక్రాల ట్రాక్టర్ నడుపుతున్నాడని అంటున్నారు. ట్రాక్టర్‌ను రివర్స్ తీసినవాడు తోపు డ్రైవర్ అంటారు.. ఇతను ఆ తోపులకే తోపు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను తొలుత బడేఛోటే అనే ట్విటర్ హ్యాండిల్‌లో కనిపించింది. ‘ఇటీవల నా జీవితం చాలా తక్కువ వనరులతో నడుస్తోంది’ అనే క్యాప్షన్‌తో ఉంది.