ట్రాక్టర్ రెండు ముక్కలైనా, డ్రైవర్ సేఫ్ (వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాక్టర్ రెండు ముక్కలైనా, డ్రైవర్ సేఫ్ (వీడియో) 

October 12, 2020

Tractor video goes viral in social media

కొందరి అదృష్టం టన్నుల కొద్దీ ఉంటుంది. ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా ప్రాణాలతో భయటపడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ట్రాక్టర్ రెండు ముక్కలు అయినప్పటికీ దాని డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. 

చిన్న రోడ్డు నుంచి ట్రాక్టర్ హైవే పైకి వచ్చింది. ఇంతలో అదే రోడ్డుపై ఓ కారు అత్యంత వేగంగా దూసుకొచ్చి ట్రాక్టర్ ముందు భాగాన్ని ఢీ కొట్టింది. కారు వేగానికి ఆ ట్రాక్టర్ ముందు భాగం రెండు ముక్కలైంది. సరిగ్గా డ్రైవర్ సీటు దగ్గర ట్రాక్టర్ విరిగిపోయింది. అయినా కూడా డ్రైవర్‌కు మాత్రం ఏం గాయాలు కాలేదు. సురక్షితంగా భయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ ప్రమాదానికి ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అదే సంతోషం అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.