తన వాకింగ్ కోసం రోడ్డును బ్లాక్ చేసిన ట్రాఫిక్ ఏసీపీ - MicTv.in - Telugu News
mictv telugu

తన వాకింగ్ కోసం రోడ్డును బ్లాక్ చేసిన ట్రాఫిక్ ఏసీపీ

June 18, 2022

 

అధికారులు తమ అధికారాలను ప్రజల కోసం ఉపయోగించకుండా తమ సొంత పనుల కోసం ఉపయోగించడం ఈ మధ్య సాధారణమైపోయింది. ఇటీవలే ఢిల్లీలో ఓ ఐఏఎస్ అధికారి జంట తమ కుక్క వాకింగ్ కోసం ఏకంగా స్టేడియాన్నే వాడుకున్నారు. ఇలాంటి ఘటనే కేరళలోని కొచ్చిలో జరిగింది. వెస్ట్ జోన్‌లో ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న వినోద్ పిళ్లై అనే ఆఫీసర్ తన వాకింగ్ కోసం క్వీస్ వాక్‌వే అనే రోడ్డును బ్లాక్ చేయించారు. అయితే మామూలుగా ఈ రోడ్డును ఆదివారం నాడు పిల్లల సైక్లింగ్, స్కేటింగ్ కోసం మూసివేస్తారు. అయితే ఏసీపీ మాత్రం మిగతా రోజులలో కూడా బ్లాక్ చేయించాడు. దాంతో ప్రయాణీకులు మూడు రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డుకు అవతలి వైపు పిల్లలను స్కూలు వ్యాను ఎక్కించడం, బారికేడ్ల వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.