కరోనాకు ట్రాఫిక్ ఏఎస్సై బలి - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాకు ట్రాఫిక్ ఏఎస్సై బలి

June 29, 2020

SR Nagar.

కరోనా సమయంలో వీర సైనికుల్లా పోరాడుతున్న కరోనా పోరాట యోధులు ఆ వైరస్‌కు  బలి అవ్వడం అత్యంత విషాదం. రాత్రింబవళ్లు అటు పోలీసులు, వైద్యులు, ఇటు పారశుద్య కార్మికులు తమ ప్రాణాలు అడ్డుపెట్టి కరోనాతో యుద్ధం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు వారి ప్రాణాలను అడ్డుపెట్టారు. అయితే వారిని కరోనా సోకి బలి తీసుకుంటోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకి హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ ఏఎస్సై సమీరుద్దీన్(57) మృతిచెందారు. 

ఈనెల 20న సమీరుద్దీన్ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన  కిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించి శ్వాస ఆడకపోవడంతో సోమవారం సాయంత్రం సమీరుద్దీన్ కన్నుమూశారు. ఆయన మృతిని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు దృవీకరించాయి.