ట్రాఫిక్‌ చలానా గడువు ముగుస్తుంది.. మళ్లీ పెంచం: ఏవీ రంగనాథ్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాఫిక్‌ చలానా గడువు ముగుస్తుంది.. మళ్లీ పెంచం: ఏవీ రంగనాథ్‌

April 13, 2022

 

తలబా

తెలంగాణ రాష్ట్రంలోని వాహనాదారులకు ట్రాఫిక్‌ పోలీసులు గతనెలలో శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద విధించబడిన చలాన్లపై రాయితీ కల్పిస్తున్నామని, కావున మార్చి 31లోపు చలాన్లను క్లియర్ చేసుకోవాలని కోరారు. దీంతో వాహనదారులు అలర్ట్ అయ్యి, తమ బండ్లకు ఉన్న చలాన్లు క్లియర్ చేసుకున్నారు. మరికొంతమంది నిర్ణీత సమయంలో కట్టకపోవడంతో గడువును మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 15వరకు పెంచారు.

అయితే, బుధవారం ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ మరొక్కసారి వాహనదారులకు చలాన్ల గడువును గుర్తు చేశారు. ఈ-లోక్‌ అదాలత్‌ గడువుకు ఇక మూడ్రోజులే మిగిలుందని తెలిపారు. ఏవీ రంగనాథ్‌ మాట్లాడుతూ..” శుక్రవారంతో ఇది ముగుస్తుంది. మళ్లీ పొడిగింపునకు అవకాశం లేదు. కావున కట్టనివారు వెంటనే కట్టేయండి” అని ఆయన స్పష్టం చేశారు. గతనెల 1న మొదలై ఈ–లోక్‌ అదాలత్‌ 31తో ముగియాల్సి ఉండగా, వాహనదారుల విజ్ఞప్తి మేరకు.. మరో పదిహేను రోజులు పొడిగించారు. శుక్రవారంతో దీని పొడిగింపు ముగుస్తుంది. మళ్లీ పొడగింపు ఉండదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగనాథ్‌ కోరారు.