పాపాయి కారుకు ట్రాఫిక్ చలానా.. ఎలా కడుతుంది? - MicTv.in - Telugu News
mictv telugu

పాపాయి కారుకు ట్రాఫిక్ చలానా.. ఎలా కడుతుంది?

October 22, 2018

రూల్స్ రూల్సే.. ఎవరు ఉల్లంఘించినా శిక్ష తప్పదు.. ఇదీ ఆ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ వైఖరి. అందుకే బుల్లికారులో షికారు కొడుతున్న చిట్టిపాపాయికి కూడా చలానా రాశాడు. ‘అనుమతి లేని చోటికి ఎందుకొచ్చావు? జరిమానా కట్టు’ అని తేల్చిచెప్పాడు.

ఈ సరదా వ్యవహారం బ్రిటన్‌లోని డోర్సెట్‌లో జరిగింది. ఓ వ్యక్తి తన కూతురిని రిమోట్ కంట్రోల్ కారులో షికారుకు తీసుకెళ్లాడు. ఓ చోట దాన్ని నిలిపేశాడు. ట్రాఫిక్ పోలీస్ చప్పున అక్కడికి వాలిపోయి బుల్లికారుకు చలానా రాసి కారుకు తగిలించాడు.. ‘వీడెవడు? నా కారును ఎత్తుకుపోడు కదా?’ అన్నట్లు పాప చూసింది. ఇదంతా ఫోన్లో రికార్డు చేస్తున్న తండ్రి.. పోలీసును ఉద్దేశించి ‘చలానా రాశావు సరే.. మరి నా బిడ్డ ఎలా చెల్లిస్తుంది? నేను మీ అధికారికి ఫిర్యాదు చేస్తా ’ అని నవ్వుతూ అన్నాడు. ‘ఏమో.. ఆ సంగతి నాకు తెలియదు.  అనుమతి లేకుండా వచ్చేసింది. చలనా కట్టాల్సిందే.. ’ అంతే సరదాగా నవ్వుతూ చెప్పాడు పోలీసు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.