రెండో పెళ్లికి కానిస్టేబుల్ బలవంతం.. యువతి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

రెండో పెళ్లికి కానిస్టేబుల్ బలవంతం.. యువతి ఆత్మహత్య

April 20, 2022

11

ఇంతకు ముందే పెళ్లయి, ఇద్దరు పిల్లలున్న కానిస్టేబుల్.. ఆ విషయం దాచి ప్రేమ పేరుతో ఓ యువతి వెంట పడ్డాడు. ఇతని నిజస్వరూపం తెలిసి దూరం పెట్టింది. అయినా వేధిస్తుండడంతో తాళలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. హనుమకొండలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శాయంపేట మండలం తహారాపూర్ గ్రామానికి చెందిన సంగీత (30) ఏటూరునాగారంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్‌గా పని చేస్తోంది. ఈక్రమంలో అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలున్న హన్మకొండ ట్రాఫిక్ కానిస్టేబుల్ సర్వేశ్ యాదవ్ పరిచయమయ్యాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని నమ్మించి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. కొంతకాలానికి సంగీత బంధువులు సర్వేశ్ గురించి విచారించగా, నిజం తెలిసిపోయింది. దీంతో పెద్దలు పంచాయితీ పెట్టి ఇక నుంచి సంగీత జోలికి రావద్దని హెచ్చరించి పంపారు. అయినా తీరు మార్చకోని సర్వేశ్ మూడు నెలలుగా ఫోన్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మళ్లీ ఫోన్ చేసి విసిగిస్తుండడంతో సంగీత తట్టుకోలేక, పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు గమనించి ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో చనిపోయింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.