Traffic Constable Shankar performed CPR and saved the person in banjara hills
mictv telugu

షాక్ కొట్టి కుప్పకూలిన వ్యక్తిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. వీడియో

November 22, 2022

Traffic Constable Shankar performed CPR and saved the person in banjara hills

ఆపద సమయంలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో ఇప్పుడు హైదరాబాదులో వైరల్ అవుతోంది. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన వీడియోను నగర ట్రాఫిక్ విభాగం ట్విట్టర్ ద్వారా పంచుకుంది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషనులో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్ కి మంగళవారం సాయంత్రం ఓ ఫోన్ కాల్ వచ్చింది.

రోడ్ నెం 1 లో జీవీకే హౌజ్ మెయిన్ గేటు వద్ద ఓ వ్యక్తి కరెంట్ షాకుతో పడిపోయాడని ఆ కాల్ సారాంశం. వెంటనే స్పందించిన కానిస్టేబుల్ శంకర్ హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. తర్వాత అతడిని అంబులెన్స్ రప్పించి ఆసుపత్రికి తరలించాడు. ఈ నేపథ్యంలో మనిషి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ శంకర్ ను స్థానికులతో పాటు పై అధికారులు సైతం అభినందించారు.