ట్రాఫిక్ లొల్లెoదుకని రోడ్డుపై సిల్లీగా ఇంకో గీత గీశాడు - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాఫిక్ లొల్లెoదుకని రోడ్డుపై సిల్లీగా ఇంకో గీత గీశాడు

December 4, 2017

 చైనాలో ట్రాఫిక్ బాధ భరించలేక సిగ్నల్ దగ్గర ఏకంగా రోడ్డుపై ట్రాఫిక్ లైన్‌లను మార్చేసాడు ఓ ప్రబుద్దుడు. కాయ్ అనే ఒక వ్యక్తి సిసి టీవీ ఫూటేజ్‌లో ఓలియాన్ యున్గాంగ్  నగరం లోని  ఒక కూడలి దగ్గర తన సొంత పెయింటింగ్ తో రోడ్ మీద గీతలు మార్చేస్తూ దొరికిపోయాడు.పోలీసులు ఇందుగ్గాను 28 ఏళ్ల కాయ్ కి వెయ్యి యువాన్ లు జరిమానా విధించారు.

‘నేను రోజు ఈ దారిలో బస్సులో వెళ్తుంటాను. ఈ కూడలి దగ్గర ట్రాఫిక్ జామ్ చాలా దారుణంగా ఉంటుంది. ఐతే ఇక్కడ కొన్ని కార్లు మాత్రమే ఎడమ వైపుకు తిరిగి వుండటం గమనించి ఒక  నిలువు గీత ద్వారా ఆ ప్రాంతాన్ని విశాలంగా చేయడానికి ప్రయత్నం చేశాను’ అని ఈ గడుగ్గాయి పోలీసులకు చెప్పిన వీడియో ఒకటి దొరికింది.  తర్వాత అధికారులు కాయ్ గీసిన గీతని చెరిపేయమని ఆదేశించారు. నువ్వు యువకుడివి, నిజాయితీ కలవాడివిగా భావించి అరెస్ట్ చెయ్యకుండా వదిలేస్తున్నాం అని అదే వీడియోలో ఒక పోలీసు అంటున్న మాటలు  కూడా రికార్డు అయ్యింది.