ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించారనే కారణంతో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డికి సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు రూ.200 ఫైన్ విధించారు. బ్యాంక్ స్ట్రీట్‌లో వెళ్తున్న ఎస్వీకృష్ణారెడ్డి బీఎండబ్ల్యూ కారును, అదే స్ట్రీట్ లో తనిఖీలు నిర్వహిస్తున్న సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు చెక్ చేయగా..ఆయన కారు నెంబర్ ప్లేట్ సరిగా లేదని గుర్తించారు. ఏపీ 05 బీవీ 0666 నంబర్‌గా గల బీఎండబ్ల్యూ కారుకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ఉండడంతో కారును నిలిపారు. కారు నుంచి దిగిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ వాడనందుకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్ రూ. 200 ఫైన్ విధించారు.
ఈ సందర్భంలోనే మిగతా సెలబ్రిటీల కంటే భిన్నంగా స్పందించారు ఎస్వీ కృష్ణారెడ్డి. తప్పు తనదేనని, కారు నెంబర్ ప్లేట్ సరిచేసుకుంటానని పోలీసులకు చెప్పారు. అంతేకాకుండా మండుటెండల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను కృష్ణారెడ్డి అభినందించారు.