సూపర్ పోలీస్.. వరద నీటిలో రోగిని భూజాలపై మోసి సేవ - MicTv.in - Telugu News
mictv telugu

సూపర్ పోలీస్.. వరద నీటిలో రోగిని భూజాలపై మోసి సేవ

August 31, 2019

ట్రాఫిక్ పోలీస్ అంటే చలానాలు వేయడం, సిగ్నల్ చూసుకోవడమే కాదు.. కష్టాల్లో ఉన్నవారి పట్ల అండగా ఉంటారని నిరూపించాడు ఓ పోలీసు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రెండ్లీ పోలిసింగ్‌కు సాక్షంగా నిలిచాడు. భారీ వర్షంతో రోడ్డుపై నీరు చేరడంతో ఓ వ్యక్తిని తన బుజాలపై మోసుకొని వరద నీటిని దాటించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసు చేసిన పనికి పలువురు అభినందిస్తున్నారు. 

ఎల్బీ‌నగర్ సిగ్నల్ వద్ద నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి వరదనీరు భారీగా వచ్చి చేరింది.ఓ యువకుడు తన తండ్రిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి తిరిగి వెళ్తుండగా వరద నీటి నుంచి వెళ్లాల్సి వచ్చింది. అయితే నీటి కారణంగా వాహనం ఆగిపోయింది. బైకు వెనుక కూర్చున్న అతని తండ్రి కిందకు దిగాల్సి వచ్చింది. అయితే కాలికి ఉన్న పట్టి తడిసిపోతుందేమోనని ఇబ్బంది పడుతున్నాడు. ఇదంతా అక్కడే ఉన్న ట్రాఫిక్ సీఐ నాగమల్లు గమనించాడు. వెంటనే అతని దగ్గరకు వచ్చి స్వయంగా తన భుజాలపై మోసుకుంటూ రోడ్డు అవతలికి దాటించాడు. దీన్ని అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ట్రాఫిక్ పోలీస్ తన ఔదార్యాన్ని చాలా గొప్పదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.