ట్రాఫిక్ పోలీస్ పైకి దూసుకెళ్లిన బస్సు..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

ట్రాఫిక్ పోలీస్ పైకి దూసుకెళ్లిన బస్సు..వీడియో

November 26, 2019

Traffic police hit by speeding bus at busy intersection

పెరుగుతోన్న రోడ్డు ట్రాఫిక్ తో వాహనదారులకు మాత్రమే కాదు ట్రాఫిక్ నియంత్రించే పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాజాగా చండీగఢ్ లో చోటుచేసుకున్న ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న కులదీప్ సింగ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను బస్సు ఢీ కొట్టింది. 

ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాద ఘటన ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఈ వీడియోను చండీగడ్ ట్రాఫిక్ ఎస్ఎస్‌పీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది.. సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు వాపోతున్నారు.