హైదరాబాద్ వాహనదారులకు ముఖ్య సూచన. నగరంలో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి.ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ దగ్గర షీ టీమ్స్ 5కే, 2.5కే రన్ నిర్వహిస్తుండడంతో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ మళ్లింపును నగరవాసులు దృష్టిలో ఉంచుకోవాలని.. దీనికి వాహనదారులు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆయా రూట్లలో కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
1.వి.వి. విగ్రహం నుంచి ఖైరతాబాద్ వంతెన, నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే ట్రాఫిక్‌ను వీవీ విగ్రహం వద్ద షాదన్ , సిరంకారి భవన్ వైపు మళ్లిస్తారు
2.ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సెక్రటేరియట్ ఓల్డ్ గేట్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పైకి మళ్లింపు
3.లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్ మలుపు వద్ద మళ్లింపు
4.కవాడిగూడ క్రాస్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వైపుకు అనుమతి నిరాకరణ
5. కర్బలా మైదాన్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ వద్ద డీబీఆర్ మిల్స్ వైపు మళ్లింపు ఉంటుంది
6. డీబీఆర్ మిల్స్ నుంచి వచ్చే వాహనాలకు చిల్డ్రన్ పార్క్ వైపు అనుమతి లేదు
7. మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రబాద్ స్టేషన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను నల్లగుట్ట జంక్షన్ వద్ద మళ్లిస్తారు