కర్నూలులో సిగ్నళ్ల వద్ద.. ఏమి హాయిలే హళా! - MicTv.in - Telugu News
mictv telugu

కర్నూలులో సిగ్నళ్ల వద్ద.. ఏమి హాయిలే హళా!

April 24, 2018

ప్రచండభానుడు చండ్రనిప్పులు కురిపిస్తున్నాడు. జీవరాశి  మొత్తం ఉడుకెత్తిపోతోంది. ఇంట్లో ఉక్క, బయట ఎండతో తల్లడిల్లిపోతున్నారు. ఇక వాహనచోదకుల కష్టాలైతే చెప్పక్కర్లేదు. అందులోనూ ఎండలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగాల్సి వస్తే మొత్తం తడారిపోతుంది. కానీ కర్నూలు జనానికి ఈ ఇబ్బంది లేదు. అక్కడి చోదకులు రైడ్ లైట్ పడితే.. నీరసపడిపోకుండా.. ‘ఏమీ నీడలే భలా..’ అంటున్నారు.

ఈ ఫొటోలు చూస్తే మీకు సీన్ అర్థమైపోయి ఉంటుంది. సిగ్నళ్ల వద్ద ఆగేవారికి ఎండదెబ్బ తగలకుండా పోలీసులు ఆకుపచ్చ పరదాలు కప్పారు. దీంతో సిగ్నళ్ల వద్ద జనం చిర్నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఇలాంటి ఏర్పాటు అన్ని ఊర్లలో ఉంటే చాలా బాగుటుంది కదా.

Image may contain: outdoor