ఏపీలో విషాదం.. బావి పూడిక తీస్తుండగా ఇద్దరు కూలీల మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో విషాదం.. బావి పూడిక తీస్తుండగా ఇద్దరు కూలీల మృతి

September 18, 2020

Tragedy in AP .. Two workers no more while digging a old well

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. పాత బావి పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని నూజివీడు మండల పరిధిలో చోటుచేసుకుంది. నూజివీడు మండలం పోనసనపల్లి గ్రామానికి చెందిన 8 మంది కూలీలు మల్లవల్లిలో పాత బావిని పూడిక తీసేందుకు వెళ్లారు. పాత బావి పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు నలుగురు కూలీలు బావిలో పడిపోయారు. వారి మీద నుంచి మట్టి కూడా పడింది. 

దీంతో వెంటనే మిగతా కూలీలు బావిలోకి దిగి ఇద్దరిని బయటకు తీసుకువచ్చి వారి ప్రాణాలు కాపాడారు. వారిలో ఇద్దరు మృతిచెందారు. మృతిచెందినవారిని అచ్చి తిరుపతయ్య(60), అచ్చి రమేష్ (40)గా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో మట్టిలో పూడుకుపోయిన మృతదేహాల కోసం జేసీబీతో అధికారులు వెదుకుతున్నారు.