కేరళలో విషాదం.. గ్యాలరీ కూలి 200 మంది.. - MicTv.in - Telugu News
mictv telugu

కేరళలో విషాదం.. గ్యాలరీ కూలి 200 మంది..

June 8, 2022

కేరళ రాష్ట్రంలో గత రాత్రి ఓ పెను ప్రమాదం తప్పిన సంఘటన చోటుచేసుకుంది. మలప్పురం జిల్లా పూంగోడ్ స్టేడియంలో మంగళవారం రాత్రి ప్రాంతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ జరుగుతుండగా మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన 200 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొంతమంది యువకులు తమ అభిమాన జట్టు గెలవాలంటూ అరుపులు, కేరింతలు, చప్పట్లు కొడుతుండంగా ఉన్నట్టుండి గ్యాలరీ (స్టాండ్) కుప్పకూలింది. దాంతో ఏం జరుగుతుందో తెలిసేలోపే 200 మందికి తీవ్రంగా గాయపడ్డారు.

 


ఈ క్రమంలో అక్కడున్న స్థానికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే గ్యాలరీ కుప్పకూలడంతో ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంతరం క్షతగాత్రులను నిలంబూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రమాదం జరిగిన తీరును వీక్షిస్తున్న నెటిజన్స్ షాక్‌కు గురౌతున్నారు.

మరోపక్క మలప్పురం జిల్లా పూంగోడ్ స్టేడియంలో ప్రతి ఏటా ప్రాంతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లను నిర్వహిస్తారు. ఎప్పటిలానే ఈసారి కూడా నిర్వహించారు. రసవత్తరంగా ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా, ఉన్నట్టుండి గ్యాలరీ (స్టాండ్) కుప్పకూలడంతో నిర్వాహకులు దిక్కుతోచక అయోమాయంలో పడ్డారు.