ఏపీలో జరుగుతున్న క్రాంతి కోడి పందేల ఆటలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో నిన్నటి నుంచి కోడి పందేల పోటీలు జరుగుతున్నాయి. వీటిని తిలకించేందుకు గ్రామం నుంచే కాకుండా పొరుగున ఉన్న గ్రామస్థులు సైతం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక పండుగ రోజైన ఆదివారం నాడు కోడి పందేలు హోరాహోరిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కోళ్లకు కట్టే కోడికత్తి గుచ్చుకుని అనంతపల్లిలో పద్మారావు అనే యువకుడు మృతి చెందాడు. కోళ్ల పెందెం నిర్వహిస్తున్న సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటతో పద్మారావు అనే యువకుడికి కోడి కత్తి గుచ్చుకుంది. దీంతో పద్మారావు అక్కడిక్కడే మృతి చెందాడు.
కోడికత్తి గుచ్చుకొని అతడికి తీవ్ర గాయమైంది. ఈ గాయం నుండి రక్తం ధారగా పోయింది. పద్మారావును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకొనేలోపుగా పద్మారావు మృతి చెందినట్టుగా డాక్టర్లు తెలిపారు. గాయం పెద్దది కావడంతో రక్తం ఎక్కువగా పోయిందని వైద్యులు తెలిపారు. ఈ కారణంగానే పద్మారావు మృతి చెందినట్టుగా చెబుతున్నారు.